04-04-2025 12:53:58 AM
కరీంనగర్/సిరిసిల్ల/పెద్దపల్లి/జగిత్యాల, ఏప్రిల్ 3(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకలను కరీంనగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
అమరుడు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసి అమరుడైన దొడ్డి కొమురయ్య భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్త్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో..
సిరిసిల్ల కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్య నాయక్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజా మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లిలో..
పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి కలెక్టర్ బి వేణు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి, సంఘ అధ్యక్షుడు మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల లో...
జగిత్యాల కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి అదనపు కలెక్టర్ బిఎస్ లత పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సునీత, తదితరులు పాల్గొన్నారు.