calender_icon.png 11 April, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు పాటుపడాలి

04-04-2025 12:00:00 AM

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి) : తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పిం చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నిజాం పాలన సమయంలో నల్గొం డ జిల్లాలో భాగంగా ఉన్న కడివెండిలో పేదలు, సామాన్యుల బతుకులు, భూమి, పంట, పశువులు, పారే నీళ్లపైనా జనాలకు హక్కులు ఉండేవి కావనీ,  పటేల్, పట్వారీల దుర్మార్గాలతో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు.

ఈ క్రమంలో పాలకుర్తి మండలం విస్నూర్‌ను కేంద్రంగా చేసుకొని ప్రజలతో నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ దాష్టికాలకు స్వస్తి పలికేం దుకు పీడిత ప్రజలు ఎర్ర జెండా నీడలో పోరుబాట పట్టారన్నారు.  1946 జూలై 4న పొట్టలో బుల్లెట్లు దుసుకెళ్లాడంతో  ఆ మహనీయుడు నేలకొరిగారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్, ఆర్డీ ఓ వినోద్ కుమార్, బీసీ శాఖ అధికారి రాజాలింగు, గొల్ల కురుమలు సంఘ నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.