calender_icon.png 4 April, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలి

04-04-2025 01:25:38 AM

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, ఏప్రిల్ 3: (విజయక్రాంతి ) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.

గురువారం  కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిదిగా పాల్గొని రెవెన్యు అదనపు కలెక్టర్ కె. వీరబ్రహ్మచారీ, ఇతర అధికారులతో కలిసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య అని ప్రశంసించారు. వెట్టి చాకిరీ, దోపిడీలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి అమరుడైన దొడ్డి కొమురయ్య సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బి.సి సంక్షేమ శాఖ అధికారి బి. నరసింహస్వామి, మైనారిటీ, ఎస్.సి సంక్షేమ శాఖ అధికారులు బి.శ్రీనివాస రావు, శ్రీనివాస్, బి.సి కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.