calender_icon.png 11 April, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ముందుకెళ్లాలి

04-04-2025 12:00:00 AM

నిజామాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): దొడ్డి కొమురయ్య  పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  దొడ్డి కొమురయ్య జయంతి  వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్లో ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు  అదనపు కలెక్టర్ అంకిత్ గారు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి  వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

అన్యాయాన్ని ఎదురించేందుకు  దొడ్డి కొమురయ్య  పోరాట తెగువ అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.  జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సహాయ అధికారి నర్సయ్య,సి. గంగాధర్, కురుమ సంఘం పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి తొండకూరు  దేవన్న, సలహాదారు మోపాల్ నరసయ్య, గంగాధర్, మోహన్, అశోక్, శ్రీనివాస్, గణేష్త, మాయావర్ రాజేశ్వర్ తదితర బీసీ నాయకులు  పాల్గొన్నారు.