calender_icon.png 28 April, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ కౌన్సిల్ సభ్యులుగా దొడ్డ వెంకటయ్య ఎన్నిక

28-04-2025 12:49:03 AM

చిలుకూరు, ఏప్రిల్ 27: అఖిల భారత రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులుగా దొడ్డ వెంకటయ్య ఎన్నిక కావడం జరి గింది. ఈనెల 15,16, 17, తేదీలలో మహా రాష్ట్రలోని నాగపట్నం లో అఖిలభారత రైతు సంఘం 30వ,జాతీయ మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకు 19 రాష్ట్రాల నుండి ప్రతినిధులు రావడం జరిగింది, అందులో 650 పైగా డెలిగేట్స్ రాగా తెలంగాణ రాష్ట్రం నుంచి 57 మంది పాల్గొన్నారు.

13 మంది మాత్రమే కౌన్సిల్ గా ఎన్నిక కావడం జరిగింది. చిలుకూరు గ్రామం నుండి సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డ వెంకటయ్య, అఖిలభారత రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఆయనను ఎన్నుకోవడం జరిగిందని విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘనమైన చరిత్ర గల అఖిలభారత రైతు సంఘం 1936, సంవత్సరం ఏర్పడిన నాటి నుండి దేశ స్వతంత్ర ఉద్యమంలో రైతులను సమీకరించడమే కాకుండా భూస్వామ్య  పెత్తందారీ, జమీందారీ పాలనకు వ్యతిరే కంగా పోరాడి విజయాలను సాధించింది.

అందులో ప్రధానమైనవి వీర తెలంగాణ విప్లవ సాయుధ రైతాంగ పోరాటమని, భూమి, భుక్తి, విముక్తి, పోరాటాలు నడిపిన ఘనమైన చరిత్ర అఖిల భారత రైతు సంఘాన్నిదని అన్నారు. ఈ నేపథ్యంలో నేడు కనీస మద్దతు ధర రైతాంగానికి అందడం లేదని సాగు నీరు, అందుబాటు లో బ్యాంకు రుణాలు, కార్పెట్ వ్యవసా యానికి వ్యతిరేకంగా నిత్యం పోరాటాలు చేస్తుందన్నారు. అనంతరం పలువురు ఆయ నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిలు కూరు గ్రామం నుండి ఆల్ ఇండియా కౌన్సి ల్ సభ్యులుగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని అన్నారు.