calender_icon.png 25 November, 2024 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమార్కులకే అండాదండ?

16-10-2024 01:04:31 AM

అడ్డు చెప్పకుండా అధికారులకు భారీగా ముడుపులు

రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు లక్షల్లో నజరానా!

డాక్యుమెంట్ ఒకటి.. పొజిషన్ మరొకటి

భద్రాద్రి కొత్తగూడెం, అక్టో బర్ 15 (విజయక్రాంతి): ప్రభుత్వ భూమి స్వాహా చేసే అక్రమార్కుడికి అధికారులు అండదండగా నిలిచారు.  అక్రమాలను నివారించాల్సిన అ ధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి, చట్టంలోని లొసుగులను వాడి కబ్జాదారుడికి సాయంచేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా పాల్వంచ మండల పరిధిలోని ఓ గ్రామపంచాయతీలో ఉన్న స్థలానికి మున్సిపాలిటీ అధికారులు అనుమతులు ఇవ్వడం ఇందు కు నిదర్శనం. ప్రభుత్వ భూమి కబ్జాచేసిన అ క్రమార్కుడు.. ఆ స్థలంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారుల అండదండలతో ఏకంగా ఫ ంక్షన్ హాల్‌నే నిర్మించడం గమనార్హం. ఇందు కు గాను అధికారులు రూ.10 లక్షల వరకు ముడుపులు ముట్టాయని పట్టణంలో ప్రచారం సాగుతోంది. 

చూసీచూడనట్టు..

పాల్వంచ మండలం సోములగూడెం పంచాయతీ పరిధిలోనిప్రభుత్వ భూమి సర్వే నంబర్ 61లోని భూమిలో  పట్టపగలు రోడ్డు నిర్మిస్తున్నా, తప్పుడు డాక్యు మెంట్‌తో దరఖాస్తు చేసినా పట్టాదారు పాసుపుస్తకం, కన్వర్షన్ చేయడానికి రెవెన్యూ అధికా రులు చూసీ చూడనట్టు వ్యవహిరించినందుకు భారీగా డబ్బులు చేతులు మారాయని తెలుస్తోంది.

ఇంటి నంబర్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి అసంపూర్తి సమాచారం ఇచ్చి నా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకున్నా.. ప్రభు త్వ భూమిలో నిర్మాణాలు చేస్తున్నా, స్థలం పంచాయతీ పరిధిలో ఉన్నా మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు 20-1-ఇన్0001, 20-1-ఇన్ 0002 కేటాయించడానికి పెద్ద మొ త్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

దీనికి తోడుగా గిరిజన చట్టాలను సైతం తుంగలో తొక్కి ఏజెన్సీ ప్రాం తంలో కన్వెన్షన్ హాల్ నిర్మించినా అధికారు లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవరించారు. నిరుపేదలు అనుమతి లేకుండా నిర్మాణం చేస్తే ఉక్కుపాదం మోపే మున్సిపల్ అధికారులు..  ఎలాంటి అనుమతి లేకుండా ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్నా పట్టించుకోకపోవడం, ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మాణం చేస్తున్నా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించ డం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిం చి హెచ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణంపై, ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన రోడ్డుపై దర్యాప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బాద్యులైన అధికారులు, అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.