హుజురాబాద్ (విజయక్రాంతి): ఇటీవల జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ డివిజన్లోని పలు గ్రామాలలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారిని ఆదివారం శంకర కంటి ఆసుపత్రి వైద్యులు గ్రామాలు తిరిగి ఆపరేషన్ చేయించుకున్న వారిని పరిశీలించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రాంపూర్ కాట్రపల్లి పెద్ద పాపయ్యపల్లి కందుగుల రంగాపూర్ గ్రామాలతో పాటు మెట్టుపల్లి ఎరుకల గూడెం గ్రామాలలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న 400 మంది వద్దకు వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వారి పరిస్థితుల గురించి పరీక్షించారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చూపు ఎలా ఉంది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని హైదరాబాదు శంకర కంటి ఆసుపత్రి వైద్యులు అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గుడిపాటి సరిత, ఇమ్మడి దయాకర్ తదితరులు ఉన్నారు.