calender_icon.png 14 March, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలశక్తికి వైద్యుడి బాసట

14-03-2025 01:28:01 AM

రూ. 7.50 లక్షలతో వాహనం అందజేత

ఫోటోలు, వాహనాన్ని ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ మార్చ్ 13 (విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లాలో బాల బాలికల భవిష్యత్తుకు భరోసా అందించే విధంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక కృషితో అమలవుతున్న బాలశక్తికి హైదరాబాద్ చెందిన వైద్యులు హర్షవర్ధన్ రెడ్డి బాసటగా నిలిచారు.

బాల బాలికలు అక్షరాస్యత పెంచి ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్య పరీక్షలు విద్యా వైద్యం స్వయం ఉపాధి చదువు యొక్క ప్రాధాన్యత బాల బాలికల చట్టాలు ప్రతి అంశాలపై బాలశక్తి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. జిల్లాలో ఐదు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ బాలశక్తి కార్యక్రమంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా దీనికి హైదరాబాద్ కు చెందిన స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి వైద్యులు ఎండి హర్షవర్ధన్ రెడ్డి బాసటగా నిలిచారు.

జిల్లాలో అమలు అవుతున్న ఈ పథకంపై తెలుసుకున్న ఆయన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యులు డాక్టర్ రాజేందర్ చిన్ననాటి మిత్రుడు వైద్యులు డాక్టర్ శ్రీనివాసులు సంప్రదించి బాలశక్తి విజయవంత చేసేందుకు వాహనాని ఉచితంగా పంపిణీ చేశారు. రూపాయలు 7.50 లక్షలతో అందించిన ఈ వాహనం ద్వారా జిల్లాలోని 18 కేజీబీవీలు 743 ప్రభుత్వ పాఠశాలలు 48 గురుకులాలు 936 అంగన్వాడీ కేంద్రాల్లో బాలశక్తి సిబ్బంది అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో చదువుకునే పిల్లలకు ఇది ఎంతగానో ప్రయోజనం చేకూర్స్తుంది.

ప్రతిరోజు బాలశక్తి సిబ్బంది ఈ వానాన్ని ఉపయోగించు కుని పాఠశాలకు వెళ్లి బాలశక్తి యొక్క ప్రాధాన్యత బాల బాలికల భవిష్యత్తు చదువు తది తర అంశాలను వివరించడం వల్ల బాల బాలికల్లో ఆత్మస్థైర్యం పెరిగి భవిష్యత్తులో తన కాళ్లపై తాము నిలబడి విధంగా కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడం పట్ల బాలికలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో 18 మంటలతో పాటు 400 గ్రామపంచాయతీలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నంతో బాల బాలికలకు పూర్తి భరోసా భద్రత ఏర్పడనుంది.

కలెక్టర్ అభిలాష అభినవ్ తన సొంత ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా దీనికి డాక్టర్ స్మార్ట్ విజన్ కంటి వైద్య నిపుణులు హర్షవర్ధన్ రెడ్డి ముందుకు వచ్చి సొంత వాహ నాన్ని సమకూర్చి అందులో భాగస్వామ్యాలు కావడం పట్ల జిల్లా అధికారులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.  ఈ పథకం ప్రారంభించిన మూడు నెలల్లోనే విజయ పతంలో దూసుకెళ్లాపడడంతో పిల్లల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు..