calender_icon.png 24 February, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యులు అందుబాటులో ఉండాలి

21-02-2025 12:00:00 AM

మెదక్, ఫిబ్రవరి 20(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పీహెచ్సీ నిర్వహణ తీరును కలెక్టర్ పరిశీలించారు. డాక్టర్లతో, రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రిని ఎల్లవేళల పరిశుభ్రంగా ఉంచాలని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ అందు బాటులో ఉండాలన్నారు. డాక్టర్‌తో వివిధ రకాల వార్డులను కలెక్టర్ సందర్శించి రోగులను పలకరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.