calender_icon.png 14 February, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యులు కాదన్నారు..

13-02-2025 11:17:14 PM

అంబులెన్స్ సిబ్బంది పురుడు పోశారు..

కామారెడ్డి జిల్లాలో ఘటన..

కామారెడ్డి (విజయక్రాంతి): ఓ మహిళ ప్రసవ వేదన పడుతుంటే వారి కుటుంబ సభ్యులు పురుడు కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రి వైద్యులు తమతో కాదని నిజామాబాద్ తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. చేసేదేం లేక గర్బిణీ తల్లితండ్రులు కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో నిజామాబాద్‌కు తరలిస్తుండగా మహిళ 108 అంబులెన్స్‌లో సిబ్బంది మహిళకు ప్రసవం చేసిన సంఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. స్థానికులు మహిళ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి ఆసుపత్రికి వెళ్తే వైద్యులు తమతో కాదని నిజామాబాద్ రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో వెళ్తుండగా 108 సిబ్బంది మార్గమధ్యలో ఆమెకు డెలివరి చేశారు.

వివరాల్లోకి వెళితే.. గాంధారి మండలం మాధవపల్లి గ్రామానికి చెందిన చింతల అఖిలకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వైద్యం చేయకుండా నిజామాబాద్ రిఫర్ చేశారు. దీంతో 108లో నిజామాబాద్ తీసుకెళ్తుండగా ఆమెకు పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్ సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. తదుపరి వైద్య సేవల గురించి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు ఈఎంటి ప్రభాకర్ పైలెట్ బిక్షఫతి తెలిపారు. వారికి గర్బిణీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.