calender_icon.png 4 April, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు అండగా సిద్దిపేట వైద్యులు

04-09-2024 12:40:21 PM

లక్ష రూపాయల చెక్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అందజేసిన సిద్దిపేట వైద్యులు.

సిద్దిపేట (విజయక్రాంతి): రాష్ట్రంలో గత 5 రోజులు భారీగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం, మహబూబాబాద్ లో వరదల కారణంగా, నష్టపోయిన వరద బాధితులకు సిద్దిపేట ఐఎమ్ఏ వైద్యులు రూ. లక్ష సహకారం అందించారు. చెక్కును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు బుధవారం అందించారు. ఈ సందర్బంగా వైద్యులను హరీష్ అభినందించారు. వైద్యులు సహకారం అందించడం సంతోషమని కష్ట సమయాల్లో ఆపద లో ఆదుకోవాలాని అండగా నిలబడాలని హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమం లో డా. భాస్కర్ రావు,  డా. సతీష్,  డా. శ్రీనివాస్,  డా. రవీకాంత్, Dr సదానందం తదితరులు పాల్గొన్నారు.