24-03-2025 05:22:57 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మెడికల్ ఆఫీసర్ డా. ఎం. రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులకు టిబి వ్యాధి నివారణ, గుర్తింపు, చికిత్స గురించి తెలియజేసి, అడల్ట్ బీసీజీ టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, మధుమేహం, పొగ త్రాగే వ్యక్తులు 60 ఏళ్లు పైబడినవారు వంటి అధిక ప్రమాదానికి గురైన వర్గాలు అందుబాటులో ఉన్నప్పుడల్లా అడల్ట్ బీసీజీ టీకా తీసుకోవాలని ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డి ఎం ఊహ శ్రీ, మధుమేహం, హైపర్ టెన్షన్ రోగులతో మాట్లాడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ మెడికల్ ఆఫీసర్ లు డాక్టర్ రత్నం, వెంకటనారాయణ, మధుసూదన్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.