calender_icon.png 27 December, 2024 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి’

03-11-2024 01:41:57 AM

మంచిర్యాల, నవంబర్ 2 (విజయక్రాంతి): జైపూర్ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని శనివారం డీఎంహెచ్ వో హరీష్‌రాజ్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన అన్ని సూచికలను పర్యవేక్షించాలని సూచించారు. వ్యాధులు, పిల్లలకు టీకాలు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో వ్యాసెక్టమీ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి ఆపరేషన్ థియేటర్‌ను సంసిద్ధం చేయాలని ఆదేశించారు.