12 ఏండ్లుగా గొర్రెల కాపరులు వారి స్థితిగతులు, ఆర్థిక ఎదుగుదల పై చేసిన సేవలకు పురస్కారం
పెద్దపల్లి, (విజయక్రాంతి): అమెరికా దేశానికి చెందిన ప్రఖ్యాత విచువల్ యూనివర్సిటీ అయిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల వాస్తవ్యులు మారం తిరుపతి యాదవ్ కు తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల కాపరులు వారి స్థితిగతులు, ఆర్థిక ఎదుగుదల మరియు మాంస ఉత్పత్తిలో నూతన పద్ధతులపై గత 12 సంవత్సరాల నుండి పరిశోధన అధ్యయనము చేస్తున్న క్రమంలో వారికి గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేటను తమిళనాడు రాష్ట్ర రాజధాని మద్రాస్ నగరంలో రాజ అన్నమలై మంద్రం నందు యూనివర్సిటీ చైర్మన్ డా. పి. మాన్యువల్, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రిటైర్డ్ తమిళనాడు హైకోర్టు జడ్జి డా . కె . వెంకటేశన్ చేతుల మీదుగా అందుకున్నారు. గత 25 సంవత్సరముల నుండి గొర్రెల కాపరుల యందు గొర్రెల పెంపకంలో అధునాతమైన నూతన పద్ధతులను వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం చేస్తున్న అధ్యయనం పై గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు గుర్తించి గౌరవ డాక్టరేట్ ను అందించినందుకు వారికి తిరుపతి యాదవ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.