30-03-2025 08:29:22 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందు పట్టణ పరిధిలోని 23వ వార్డు, 24 ఏరియాకి చెందిన ఓరం అశోక్ కుమార్, అనసూయ దంపతుల రెండవ కుమారుడు ఓరం కిరణ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా విభాగంలో సైంటిస్టుగా పనిచేస్తున్న ఓరం కిరణ్ కుమార్ కరీంనగర్ జిల్లా శనిగారం ప్రాజెక్టులో నీటి పారుదల, లభ్యత, ఉపయోగంపై జియోగ్రాఫి ఇన్ఫర్మేషన్ సిస్టం, రిమోట్ సెన్సిoగ్ విధానాలపై పరిశోధనలు చేసినందుకు గాను ఉస్మానియా యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ పొందారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... జియోగ్రఫీ ఇన్ఫర్మేషన్ సిస్టం రిమోట్ సెన్సింగ్ వలన కలిగే ఉపయోగాలపైనా కరీంనగర్ జిల్లాలోని శనిగరం ప్రాజెక్టు నీటిపారుదల నిర్వహణపై పరిశోధనలు చేసినట్లు తెలిపారు.
తాను చేసిన పరిశోధనలకు ప్రొఫెసర్ గీతారెడ్డి అనంత్ సహాయ సహకారాలు, సూచనలు సలహాలు అందించారని తెలిపారు. ఈ సందర్భంగా గీతా రెడ్డితో పాటు, ఇతర ప్రొఫెసర్లకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. చిన్ననాటి నుండి తన తల్లిదండ్రులు క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించడం మూలాన దాని స్థాయికి ఎదగగలిగినట్లు తెలిపారు. తాను పొందిన ఈ డాక్టరేట్ ను స్వర్గస్తులైన తన తల్లి అనసూయకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. తాను ఈ స్థాయికి ఎదగటానికి తల్లిదండ్రులతో పాటు, సోదరులు సంతోష్, నవీన్, చెల్లి మానస, బావ మాధవరావు, జీవిత భాగస్వామి విశాలి లా, ఇతర కుటుంబ సభ్యులు సహాయ ప్రోత్సహం మరువలేని మన్నారు. ఇది ఇలా ఉండగా కిరణ్ డాక్టర్ పొందిన సందర్భంగా తోటి ఉద్యోగులు, చిన్ననాటి స్నేహితులు ఏరియా పెద్దలు కిరణ్ కు అభినందనలు తెలిపారు.