19-02-2025 12:20:23 AM
ఖమ్మం, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి):- స్థానిక ఎస్‌ఆర్‌బిజిఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాలలో జువాలజీ అసి స్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బండారు చెంచురత్నయ్యకు, తిరుపతి, శ్రీవెంకటేశ్వ ర విశ్వవిద్యాలయం, డాక్టరేట్ ప్రకటిస్తూ, యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికా రిక ఉత్తర్వులు జారీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.మొహ్మద్ జాకిరుల్లా, అభి నందన పూర్వక ప్రకటనలో తెలిపారు. ఎస్.వి యూనివర్సిటీ జూవాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఏ.ఉషారాణి పర్యవేక్షణలో ‘ఆర్సినిక్ ఇండ్యూస్డ్ టాక్సీ సిటీ అండ్ ఇట్స్ బయో కెమికల్ ఎఫెక్ట్ ఆన్ ది సెలెక్టెడ్ టిష్యూ స్ ఆఫ్ మెల్ ఆల్బినో ర్యాట్’ అనే అంశంపై పరిశోధనా సిధ్ధాంత గ్రంధాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్.వి. జువాలజీ బోర్డు ఆఫ్ స్టడీస్ అధిపతి ప్రొఫె సర్ ఎస్.కిషోర్, కళాశాల విభాగా ధిపతి, ఐక్యూ ఏసి కోఆర్డినేటర్ డా.సునంద, అధ్యాపకులు బి.కవిత, ఎం.శ్రీనివాస శరీ న్, బి.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ సెన్సైస్ డా.బానోత్‌రెడ్డి, స్టాఫ్ సెక్రటరీ డా.శ్రీనివా స్, వివిధ విభాగాల అధ్యాపకులు డా.చెం చురత్నయ్యకు అభినందనలు తెలిపారు.