మంచిర్యాల, విజయక్రాంతి : మంచిర్యాల జిల్లా గద్దెరాగడి ప్రాంతానికి చెందిన తూటి రజితకు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సబర్మతి విశ్వవిద్యాలయం డాక్టరేట్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. రజిత లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో వాణిజ్యశాస్త్ర (కామర్స్) విభాగంలో అతిథి అధ్యాపకురాలి(గెస్ట్ లెక్చరర్)గా పని చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన డాక్టర్ వినోద్ కుమార్ మిశ్రా మార్గనిర్దేశకుడిగా 'సగటు రాబడి, రిస్క్ అండ్ స్టాక్స్ గ్రోత్'పై మార్కెట్, పెట్టుబడిదారుల పరిశీలనపై తులనాత్మక విశ్లేషణ' అనే అంశంపై పరిశోధన చేసినందుకుగాను సబర్మతి విశ్వవిద్యాలయం డాక్టరేట్ అందజేసింది. డాక్టరేట్ పొందిన రజితను తల్లిదండ్రులు తూటి శంకర్ - కొమురమ్మ, కళాశాల అధ్యాపక బృందం, రాష్ట్ర, జిల్లా అతిథి అధ్యాపకుల బృందం అభినందించారు.