హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ఉస్మాని యా యూనివర్సిటీ కామర్స్ విభాగం పరిశోధక విద్యార్థి శీలం నాగేశ్వరరావు డాక్టరేట్ పొందారు. ‘సోషల్ సెక్యూరిటీ ఫర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఏ స్టడీ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ’ అనే అంశంపై ఓయూ సీనియర్ ప్రొఫెసర్ కేవీ అచలపతి పర్యవేక్షణలో నాగేశ్వరరావు విజయవంతంగా పరిశోధనను పూర్తి చేశారు.
ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఆయన ఓయూలో కామర్స్ విభాగంలో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఐసీఎస్‌ఎస్‌ఆర్ ఫెలోషిప్ కూడా సాధించారు.