calender_icon.png 2 April, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగిపల్లి గ్రామ వాస్తవ్యునికి డాక్టరేట్

29-03-2025 12:54:43 AM

కరీంనగర్ క్రైమ్, మార్చి 28 (విజయ క్రాంతి):  శాతవాహన యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగంలో యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ పైన పరిశోధనకు గాను మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన కుడికాల సదానందం కి శాతవాహన విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ బి సురేష్ కుమార్ డాక్టరేట్ ప్రధానం చేశారు.

డాక్టర్ ఎం సరసిజా అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణలో సర్చ్ ఫర్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ గ్రీన్ సింథసిస్ ఆఫ్ హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అనే శీర్షికతో పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్ ప్రధానం చేసారు. ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సాధించి తన చిరకాల వాంఛ అయిన పి.హెచ్ డి పట్టాని పొందినందుకు చాలా సంతోషంగా ఉంది అని కుడికాల సదానందం తెలిపారు.