calender_icon.png 5 February, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబదాసుకు డాక్టరేట్

05-02-2025 01:25:26 AM

పటాన్ చెరు,  ఫిబ్రవరి 4 : జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన ఏఐఎస్‌ఎస్డీ (ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్) రాష్ట్ర నాయకుడు కాసాల అంబదాస్  గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 

హైదరాబాద్ లో ఆసియా  ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ మంగళవారం గౌరవ డాక్టరేట్ అందజేసినట్లు అంబదాసు తెలిపారు. తాను చేస్తున్న సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ ప్రధానం చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.