11-04-2025 12:53:42 AM
కరీంనగర్, ఏప్రిల్ 10 (విజయ క్రాంతి): నగరానికిక చెందిన కవ్వం పల్లి జ్యోతిర్మయి రాణి కి ఉస్మానియా విశ్వవి ద్యాలయం గణితశాస్త్రంలో డాక్టరేట్ ప్రధా నం చేసింది. ‘ సర్టెన్ ఫికస్డ్ అండ్ కపుల్ద్ ఫికస్డ్ పాయింట్ థీరమ్స్ ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ మెట్రిక్ స్పేసెస్ విత్ అప్లికేషన్స్‘ అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వి. నాగరాజు పర్యవేక్షణలో సమర్పించిన థీసిస్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధా నం చేసింది. కవ్వంపల్లి జ్యోతిర్మయి రాణి ప్రస్తుతం నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణితంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టరేట్ సాధించడం పట్ల పలువురు అభినందించారు.