15-04-2025 09:22:55 AM
- ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పై ప్రశంసలు
రాజేంద్రనగర్: విమానంలో ఓ వృద్దుడికి డాక్టర్ సీపీ ఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. డాక్టర్ ఎవరో కాదు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి. ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో ఆదివారం రాత్రి ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న డా.ప్రీతిరెడ్డి ఈ విషయం గమనించారు. వెంటనే అతడికి సిపిఆర్ చేశారు. అతడు స్పృహలోకి వచ్చాడు. డాక్టర్ ప్రీతిరెడ్డి చొరవపట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.