calender_icon.png 24 February, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యుడి నిర్లక్ష్యం.. బాలుడి మృతి

24-02-2025 12:02:40 AM

గద్వాల, ఫిబ్రవరి 23 ( విజయక్రాంతి ) : అలంపూర్ మండలం క్యాతుర్ గ్రామంలో ఆదివారం కుక్క కాటు తో బాలుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.  వివరాల ప్రకారంగా... క్యాతురు గ్రామా నికి చెందిన సాయి కుమార్, వెంకట లక్ష్మి దంపతులకు హర్ష వర్ధన్ (4), హర్షిత పిల్లలు ఉన్నారు. జనవరి 22 న ఇద్దరు పిల్లలని కుక్క కరిచింది.

తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరినీ క్యాతురు లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. పాపకు ట్రీట్మెం ట్ ఇచ్చి బాబుకు చిన్న ఘాటు అయ్యిందని ఏం కాదని చెప్పడంతో పిల్లల్ని ఇంటికి తీసుకుని వెళ్లారు. పాప కు నయం కాగా రెండు మూడు రోజుల నుండి బాలుడు విచిత్రంగా ప్రవర్తించడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

బాబుని పరిక్షించిన వైద్యులు బాలుడికి కుక్క కాటుకు ట్రీట్మెంట్ చేయకపోవడంతో బతకడం కష్టమని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు హైదరాబాద్ తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. సరిగ్గా వైద్యం చేయకపోవడంతోనే తమ కుమారుడు చనిపోయారని తల్లి దండ్రులు ఆసుపత్రి దగ్గర ఆందోళన చేశారు.

విషయం తెలుసుకున్న అలంపూర్ ఎస్ ఐ క్యాతురు ప్రభుత్వా సుపత్రి దగ్గరికి చేరుకొని తల్లి దండ్రులతో మాట్లాడి తండ్రి సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.