calender_icon.png 25 October, 2024 | 5:53 AM

గుండెపోటుతో వైద్యుడి మృతి

18-09-2024 12:45:24 AM

నిర్మల్, సెప్టెంబర్17 (విజయక్రాం తి): నిర్మల్‌కు చెందిన ప్రముఖ దంత వైద్యుడు నవీన్ గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం గోవాకు వెళ్లిన వైద్యుడికి మంగళవా రం చాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‌కు వెళ్ళిన కొద్ది సేపటికే నవీన్ మృతి చెందినట్టు వైద్యులు తెలుపడంతో కుటుంబసభ్యులు విషాదం నెలకొం ది. నిర్మల్ పట్టణంలో సీనియర్ వైద్యుడైన నవీన్ సామాజిక సేవలతో మం చి గుర్తింపు తెచ్చుకొన్నారు. నవీన మృతి పట్ల నిర్మల్ వైద్యులు సంతా పం తెలిపారు.