calender_icon.png 30 September, 2024 | 3:08 PM

సిద్దిపేట ఐఎంఏ అధ్యక్షులుగా డాక్టర్ చందర్

30-09-2024 01:00:08 PM

నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ అధ్యక్షులుగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చందర్ ఎన్నికయ్యారు. ఐఎంఏ నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించారు. ఇటీవల నూతన కార్యవర్గం ఏర్పాటు అయిన సందర్బంగా హరీష్ రావు సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో నూతన అధ్యక్షులు డా. చందర్, ఉపాధ్యక్షులు భాస్కర్, డా. గణేష్, డా.బాబు, డా.ప్రశాంత్ లు కలిశారు. ఈ సందర్బంగా సిద్దిపేట వైద్యులు వృత్తితో పాటు సామాజిక సేవచేయడంలో ఆదర్శంగా నిలుస్తున్నారని అ దిశగా నూతన కార్యవర్గం పని చేయాలనీ సూచించారు. ఈ సందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.