calender_icon.png 28 November, 2024 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్దెకు డాక్టర్ సర్టిఫికెట్లు!

28-11-2024 12:38:10 AM

  1. ఆసుపత్రి అనుమతి కోసం కిరాయికి.. 
  2. జిల్లాలో పుట్ట గొడుగుల్లా దవాఖానలు

సూర్యాపేట, నవంబర్ 27 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యం అద్దె సర్టిఫికెట్లతో అనుమతులు తీసు కుని అర్హత లేని డాక్టర్లతో వైద్యం చేయిస్తున్నాయి. దీనికి తోడుగా ప్రభుత్వ వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా సొంత ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు.

రోగులను తమ దవాఖానలకు తీసుకొచ్చేందుకు ఆర్‌ఎంపీ, పీఎంపీలకు రోగి చెల్లించే బిల్లులో 30 నుంచి 50 శాతం కమీషన్లు ఇస్తున్నట్టు తెలు స్తున్నది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం మాముళ్లు తీసుకుని పట్టించుకోవ డం లేదని తెలుస్తున్నది.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ డాక్టర్లు..

అల్లోపతి హాస్పిటల్ ఏర్పాటుకు డీఎంహెచ్‌వో అనుమతి తప్పనిసరి. సూర్యాపేట పట్టణంలో 105 ప్రైవేట్ ఆసుపత్రులు ఉండగా ఇందులో 57 నిబంధనల విరుద్ధంగా నడుస్తున్నాయని ఆరోపణ. అందులో 35  హాస్పి టల్స్ గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్న ఒక్క డాక్టర్‌తోనే నడుస్తున్నాయి. కొందరు వైద్యులు కొన్ని దవాఖానల్లో పనిచేయనప్పటికీ వాటి అనుమతి కోసం తమ సర్టిఫికెట్లను అద్దెకు ఇచ్చినట్టు తెలుస్తున్న ది.

జిల్లా ఆసుపత్రిలో పనిచేసే కొందరు సీనియర్ వైద్యులు తమ డ్యూటీ సమయంలోనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి తోడు డాక్టర్ ప్రిస్క్రిషన్ లేకుండానే యాంటి బయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్లను మెడికల్ దుకాణా ల్లో విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

జిల్లా కేంద్రంలో ఉన్న పలు ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై పలుమార్లు పత్రికల్లో ప్రచురించినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మాత్రం అమ్ము డుపోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు.