* ఉపగ్రహాలు సురక్షితమన్న ఇస్రో
న్యూఢిల్లీ, జనవరి 8: ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్ డాకింగ్ మరోసారి వాయిదా పడింది. తొలుత జనవరి 7న డాకింగ్ చేపట్టాలని ఇస్రో భావించగా.. సాంకేతిక కారణాలతో 9వ తేదీకి వాయిదా పడింది. కాగా నేడు మరోసారి కూడా డాకింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఉపగ్రహాలు మాత్రం సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది.
రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 225 మీటర్లకు చేర్చేందుకు ఓ విన్యాసం నిర్వహించగా.. దూరం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని ఇస్రో వెల్లడించింది. డాకింగ్ అయితే వాయిదా వేసింది కానీ మరలా ఎప్పుడూ ఈ ప్రక్రియను నిర్వహించేంది మాత్రం వెల్లడించలేదు.