calender_icon.png 26 October, 2024 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగస్టు రెండోవారంలో రేవు

16-07-2024 12:10:00 AM

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పారుపల్లి ప్రొడక్షన్ పతాకాలపై డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాణ పర్యవేక్షకుడిగా సీనియర్ పాత్రికేయుడు ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు బాబీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ -“ఈ సినిమాకు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా కొత్త వారు. యంగ్ టీమ్ కలిసి ఈ సినిమాకు పనిచేయడం నన్ను ఆకట్టుకుంది.

ఇంతమంది కొత్త వాళ్లకు “రేవు” సినిమాలో అవకాశం ఇవ్వడం మంచి విషయం. నేను శ్రీహరి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి ప్రభు గారు తెలుసు. డైరెక్టర్‌గా నన్ను ముందు నుంచి ప్రోత్సహిస్తున్నారు. పర్వతనేని రాంబాబు గారితో కలిసి వారి మరో మిత్రుడు మురళీ గింజుపల్లితో కలిసి చేస్తున్న ఈ “రేవు” సినిమా విజువల్స్ చూశాను. చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ తన ప్రతిభ చూపించారు. ఓటీటీల్లో మంచి కంటెంట్ గల సినిమాలని చూస్తాం. “రేవు” అలాంటి సినిమానే. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావడంతో పాటు నిర్మాతకు డబ్బులు తీసుకుని రావాలని కోరుకుంటున్నా” అన్నారు. తుది దశ నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా ఆగస్టు రెండో వారంలో థియేటర్స్‌లో విడుదల కానుంది.