20-04-2025 12:49:17 AM
ఓఆర్‌ఎస్ పేరుతో నకిలీల దందా
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఆరోగ్యం మెరుగుపడాలని మార్కె ట్‌లో టెట్రా ప్యాకెట్ల రూపంలో దొరికే ఓరల్ రీహైడ్రేటేషన్ సొల్యూషన్(ఓఆర్‌ఎస్)ను కొని తెచ్చుకుంటే.. షుగర్ ముప్పు ను కొని తెచ్చికున్నట్టే అవుతుంది. ఇవి ఉట్టి గాలి మాటలు కాదు. వైద్యులే ఈ విషయా న్ని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
డయేరియా, వాంతులు, విరోచనాలు, జ్వరం వచ్చిన సందర్భాల్లో శరీరంలో నీటితో పా టు లవణాలు సమతౌల్యంగా ఉండేందుకు ఓఆర్ ఎస్‌ను తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఫలితంగా రోగులు నీరసించిపోరు. ఇందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఫార్ము లా ప్రకారమే ఓఆర్‌ఎస్‌ను తయారు చేసి, విక్రయించాల్సి ఉంటుంది.
అయితే, దీన్ని కూడా సొమ్ము చేసుకునేందుకు ఔషధ కంపెనీలు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నాయి. చక్కెర స్థాయిలు అధికంగా ఉండే ద్రావణాలను ఓఆర్‌ఎస్ పేరుతో తయారు చేస్తూ, ఆకర్షణీయమైన ప్రకటనలతో తమ విక్రయాలు పెంచుకుంటున్నాయి. అయితే, వీటిని తీసుకున్న రోగుల ఆరో గ్యం మెరుగుపడకపోగా మరింత అనారోగ్యం బారిన పడుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఓఆర్‌ఎస్ ఎందుకంటే..
డబ్ల్యూహెచ్‌ఓ ఫార్ములా మేరకు తయారైన 21 గ్రామలు ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లో గ్లూకోజ్ 13.5 గ్రాములు, సోడియం క్లోరైడ్ గ్రాము లు, పొటాషియం క్లోరైడ్ 1.5 గ్రాములు, ట్రైసోడియం సిట్రేట్ డీహైడ్రేట్ 2.9 గ్రాములు, ఓస్మోలారిటీ 245 ఎంవోఎస్‌ఎమ్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోగులకు సత్తువ వ స్తుంది. మెడికల్ షాపులు కచ్చితంగా ఈ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లనే విక్రయించాలి. అయితే కొన్ని కంపెనీలు ఓఆర్‌ఎస్ పేరుతో అధిక చక్కరలు గల ద్రావణాలను రోగులకు అట్టగడుతు న్నాయి. వీటిలో నిర్ణయించిన దానికంటే ఎక్కువ పరిమాణంలో చక్కరలు ఉంటాయి. అందువల్ల డబ్ల్యూహెచ్‌వో ప్ర మాణాల మేరకు తయారైన ఓఆర్‌ఎస్‌లనే తీసుకోవా లని వైద్యులు చెపుతున్నారు.
అవి అత్యంత ప్రమాదకరం
ఓఆర్‌ఎస్ పేరిట టెట్రాప్యాకెట్ల ద్వారా మార్కెట్‌లో దొరుకుతున్న ద్రవణాల్లో చక్కర స్థాయిలు అధికంగా ఉం టాయి. వీటిని తాగితే శరీరంలో షుగర్ స్థాయిలు భారీగా పెరుగుతాయి. ఓఆర్‌ఎస్ ఎలక్ట్రోలైట్ డ్రింక్‌లో 100 మి.లీ.లో 11 గ్రాముల కంటే ఎక్కు వ చక్కెర స్థాయిలుంటాయి. ఫలితంగా ఆరోగ్యం పాడు వుతుంది. షుగర్‌తో బాధపడేవారు వీటిని తీసుకోవడం ప్రమాదకరం. ఓఆర్‌ఎస్ టెట్రా ప్యాకెట్లు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రజలు డబ్ల్యూహెచ్‌వో సూచించిన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు మాత్రమే కావాలని మెడికల్ షాపు వారిని అడగాలి.
శివరంజని సంతోష్,
ప్రముఖ పీడియాట్రీషియన్