calender_icon.png 30 September, 2024 | 8:59 PM

కొలువు కావాలా నాయనా..

30-09-2024 12:00:00 AM

ఆరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నా, ఏదైనా ప్రైవేట్ కంపెనీలో పనిచేయాలన్నా పది, ఇంటర్ కనీస అర్హతగా ఉండేది. అయితే దాంతోపాటు టైపింగ్ కూడా అదనపు అర్హతగా భావించేవారు. అందుకే టైపింగ్‌కు ఎక్కడాలేని ప్రాధాన్యం ఉండేది. ఇక ప్రభుత్వ కొలువులకు టైపింగ్ కీలకం కావడంతో టైపింగ్ నేర్చుకోవడానికి చాలామంది ఆసక్తి చూపేవారు. టైప్ రైటింగ్ కోర్సు చేసినవారికి క్లర్క్ ఉద్యోగాలు వచ్చేవి.

అప్పట్లో యువత టైపింగ్ నేర్చుకోవడం గొప్పగా భావించేవారు కూడా. అయితే ఎప్పుడైతే కంప్యూటర్లు వచ్చాక టైప్ రైటర్లతోపాటు శిక్షణ ఇచ్చే సంస్థలు క్రమంగా మూతబడ్డాయి. అయితే వాటికి ఆదరణ తగ్గినా వాటినే నమ్ముకున్నవారు మాత్రం ఇంకా శిక్షణ కొనసాగిస్తూ ఉండటం విశేషం.