calender_icon.png 23 October, 2024 | 8:58 AM

వీటిని రోజూ వాడుతున్నారా?

03-10-2024 12:00:00 AM

ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు స్కిన్ కేర్‌పై దృష్టి సారిస్తున్నారు. అందంగా కనిపించేందుకు రోజూ ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే కొన్ని ఉత్పత్తులను రోజూ వాడటం వల్ల హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మృతకణాలు, మలినాలు తొలగిపోతాయి. అయితే రోజూ స్క్రబ్ చేయ్యడం మంచిది కాదు. ఇలా చేస్తే చర్మం పొడిబారిపోయి, నిర్జీవంగా మారుతుంది. కాబట్టి వారానికి రెండు, మూడుసార్లు మాత్రమే స్క్రబ్ చెయ్యాలి. 

* వాటర్‌ఫ్రూప్ మస్కారాను రోజూ ఉపయోగించడం వల్ల అది కనుబొమ్మల్లో ఉండే సహజ సిద్ధమైన తేమని హరించడమే కాకుండా అవి పొడిబారిపాయేలా కూడా చేస్తుంది. 

* పొడిబారిన కురులకు తేమనందించి తిరిగి సాధారణ స్థితికి తెచ్చేందుకు డీప్ కండిషనర్స్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని రోజూ ఉపయోగించడం వల్ల కురులు పొడిబారిపోతాయి. జుట్టులో ఉండే పీహెచ్ స్థాయులపై కండిషనర్ ప్రభావం చూపడం వల్లే అలా జరుగుతుందంటున్నారు నిపుణులు. ఇది కాకుండా తరచూ జుట్టుకు నూనె పెట్టడం ఉపయోగకరంగా ఉంటుంది.