13-04-2025 12:34:36 AM
ఎండాకాలంలో డియోడరెంట్ల వాడకం ఎక్కువ. చెమట దుర్వాసనను దాచడం కోసం కొందరు వాడితే, పరిమళాలు వెదజల్లడం కోసం మరికొందరు వీటిని ఎంచుకుంటూ ఉంటారు. అయితే వాటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంపై వచ్చే చెమట వల్ల దుర్వాసన రాదు. చర్మంపై పెరిగే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కాబట్టి శరీర దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటే ముందుగా దాని కారణాన్ని తెలుసుకోవాలి. అలా కాకుండా డియోడరెంట్‌ను ఎక్కువగా వాడటం వల్ల ఉపయోగం ఉండదు. చర్మం సున్నితంగా ఉంటే చాలా జాగ్రత్తగా డియోడరెంట్‌ని ఎంచుకోవాలి. ఒక్కోసారి ఒక లేయర్ డియోడరెంట్ సరిపోకపోవచ్చు. మరీ ముఖ్యంగా సాన్నం చేసిన వెంటనే డియోడరెంట్ వాడాలి. మోకాళ్ల వెనక, తొడల మధ్య కూడా ఉపయోగించాలి. ఏళ్లతరబడి ఒకే రకం డియోడరెంట్ వాడితే.. దానికి స్వేదగ్రంథులు అలవాటుపడిపోతూ ఉంటాయి. కాబట్టి తరచుగా డియోడరెంట్లను మారుస్తూ ఉండాలి.