calender_icon.png 29 November, 2024 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డస్ట్ అలర్జీతో బాధపడుతున్నారా?

29-11-2024 12:00:00 AM

ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిలో డస్ట్ అలర్జీ అనేది సర్వసా ధారణం. అలర్జీల నుంచి ఉపశమనం పొందేందుకు మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ సమస్యను నియంత్రించేందుకు కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలు వంటింటిలో ఉన్నాయి. అలర్జీ నుంచి ఉపశమనం పొందాలంటే కింది చిట్కాలను పాటించండి. 

* గోరువెచ్చటి నీటిలో రాళ్ల ఉప్పును కరిగించి ముక్కుతో పీల్చడం వల్ల అలర్జీల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది ముక్కును క్లియర్ చేయడమే కాకుండా గొంతులో వాపును కూడా తగ్గిస్తుంది. 

* ఒక చెంచా తేనెలో అల్లం రసం కలిపి తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అల్లం తేనెలో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఈ మిశ్రమం గొంతు నొప్పిని తగ్గిస్తుంది. 

* నీటిలో తులసి ఆకులను వేసి మరిగించి అందులో పసుపు వేసి బాగా కలిపి తాగాలి. ఈ మిశ్రమం శరీరం నుంచి మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది. అలర్జీల వల్ల వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

* జీర్ణ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థకు సోంపు, జిలకర నీరు బాగా పని చేస్తాయి. వీటితో మరిగించిన నీటిని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగడం వల్ల డస్ట్ అలర్జీ లక్షణాలు తగ్గుతాయి.