18-02-2025 12:56:46 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) : విద్యార్థులు మంచి విద్య అందిపుచ్చుకొని ఉన్నత చదువులు చదివి వారి కుటుంబాలకు అండగా ఉందామనుకుంటే... ఆదిలోనే తుంచేలా రాజాపూర్ కేజీబీవీ పాఠశాల నిర్వహణ మారుపేరుగా నిలుస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్న రాజాపూర్ కేజీబీవీ ఎస్ ఓ పావని ,ఇంగ్లీష్ టీచర్ మంజుల ను సర్వీస్ నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. కష్టప పాఠశాలలపై డిఇఓ పర్యవేక్షణ సక్రమంగా లేదని ఆసన్న వ్యక్తం చేశారు.
వీరి వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు ఇంటికి పారిపోతున్నారని,ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించినట్లు విద్యార్థులు తెలుపుతున్నారు.విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడమే గాక... విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకొని ఎడ్ల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భరత్ కుమార్, సంతోష్ రాథోడ్, పర్ష, శ్రావణ్, రమేష్ తదితరులు ఉన్నారు.