calender_icon.png 1 February, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లవ్‌స్టోరీలో సాలిడ్ డ్రామా ప్రేమిస్తావా

29-01-2025 12:00:00 AM

ఆకాశ్ మురళి, అదితి శంకర్ జంటగా విష్ణువర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పా యా’ పేరుతో విడుదలై మం చి విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను జనవరి 30న తెలుగులో విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమిస్తావా’ అనే టైటిల్‌తో అనువాదం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలుగు ట్రైలర్ లాంచ్ వేడుకను మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈవెంట్‌లో హీరో ఆకాశ్ మురళి మాట్లాడుతూ.. ‘నా ఫస్ట్ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడం నిజంగా నా అదృష్టం. ప్రేమిస్తావా సినిమాకు అందరి సపోర్ట్ కావాలి. అదితి నిజంగా బెస్ట్ కోస్టార్’ అని చెప్పారు. అదితి శంకర్ మాట్లాడుతూ.. ‘ఇది నా ఫస్ట్ లవ్ స్టోరీ. ఇందులో లవ్, యాక్షన్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి’ అని తెలిపారు.

నిర్మాత స్నేహ బ్రిట్టో మాట్లాడుతూ.. ‘అదితి స్క్రీన్ మీద చాలా బబ్లీగా కనిపించి ఆకట్టుకుంది. ఆకాశ్‌కు  ఇది మంచి డెబ్యూ సినిమా’ అన్నారు. డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ.. ‘ఏడెనిమిదేళ్ల తర్వాత తెలుగు వారిని కలుస్తున్నా.

నేను తెలుగులో మాట్లాడితే మా అమ్మ సంతోషపడుతుంది. ఈ సినిమా ప్రస్తుతం సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తుంది. అదితి, ఆకాశ్ చాలా చక్కగా నటించారు. కొన్ని సీన్స్‌లో వాళ్ల నటన చూసి ఎమోషనల్ అయ్యాను. లవ్ స్టోరీలో సాలిడ్ డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది’ అని చెప్పారు.