మీ ఇంట్లో వాచీలో నా బొమ్మ ఉంది..
ఖమ్మం, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ఏం అక్కా చెల్లమ్మలు బాగున్నారా?.. సొంత ఇళ్లున్నాయా మీకు..ఇంతకీ నేనెవరో తెలుసా..? మీ ఇంటి వాచీలో నా బొమ్మ ఉంది.. గుర్తు పట్టారా?.. అంటూ మహిళా కూలీలతో రెవిన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాసేపు సరదాగా ము చ్చటించారు.
అశ్వారావుపేట నియోజకవర్గ పర్యటనకు గురువారం వచ్చిన ఆయన అశ్వారావుపేట మండలంలో తన పర్యటనను ముగించుకుని ములకలపల్లి వెళ్తూ మార్గమధ్యలో శనగకాయలు శుభ్రంచేస్తున్న మహిళా కూలీలను చూసి, ఆగారు. వారితో కాసేపు సరాదాగా మాట్లాడారు. చేతికి గాజులు వేయించుకోమని చెప్పి కొంత నగదును కూడా మహిళా కూలీలకు అందించారు.
అదే విధంగా కొద్దిదూరం వెళ్ళాక మరొక ప్రాంతంలో ఆగి అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడుతూ.. సంక్రాంతి నాటికి ఇందిర మ్మ ఇళ్లు ఇస్తానని, నచ్చినట్లు కట్టుకోవాలని చెప్పారు. అర్హులైన వారికి ఇళ్లు కట్టుకునేందుకు వివిధ దశల్లో రూ. 5 లక్షలు ఇస్తానని, ధైర్యంగా ఉండాలని అన్నారు.
కాలనీల్లో రోడ్లు, సైడ్ డ్రైన్లు కూడా కట్టించి ఇస్తానని మహిళలకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ సం దర్భంగా మహిళలతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శనగకాయాలు ఎలా ఉన్నాయంటూ కొన్ని తీసుకుని, తింటూ వారితో నవ్వుతూ మాట్లాడారు.
సంక్రాంతికి ఇండ్లు కానుకగా ఇస్తాం
సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి, నిరు పేదలకు కానుకగా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని దమ్మపేట ఎంపిడివో కార్యాలయంలో ఆయన గురువారం ఇందిరమ్మ మోడల్ హౌస్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొం గులేటి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4లక్షల 50వేల ఇందిర మ్మ ఇండ్లను పేదలకు కానుకగా ఇస్తామన్నారు. అందులో భాగంగా ప్రతి నియోజక వర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు.
అశ్వారావుపేట నియోజక వర్గంలో ఎక్కువ సంఖ్యలో గిరిజనులు ఉన్నందున అదనంగా మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, ఏజెన్సీ ప్రాంతానికి లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలందరికీ న్యాయం చేస్తామన్నారు. పార్టీలు, కులం, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్క పేదవానికి న్యాయం చేస్తామని తెలిపారు.
ఇండ్లు ఇచ్చి న తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా లేదా అని అడగమని అన్నారు. పేదవానికి న్యా యం చేయడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని చెప్పారు. పేదవాళ్లలో బహుపేదవాళ్లు ముందు ఇళ్లు కట్టుకోవాలన్నారు. ఇండ్లు ఇచ్చే కార్యక్రమం నిరంతరమన్నారు.
మీడి యా మిత్రుల్లో కూడా చాలా పేదవారు ఉన్నారని, వారు ఎంతో ఇబ్బందిపడుతున్నారని, వారిలో అర్హులైన వారికి ఇందిర మ్మ ఇండ్లు మొదటి విడతలోనే ఇస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీలు కూడా పేదలు ఇండ్లు త్వరితగతితంగా పూర్తి చేసేందుకు అండగా ఉండాలన్నారు. అధికారంతో వ్యవహరించవద్దన్నారు.
పేదలకు కమిటీలు తోడ్పాటును అందించాలని మంత్రి అన్నా రు. ఈ సందర్భంగా మంత్రి దమ్మపేట మం డలం నాచారంలో 40 లక్షల రూపాయల తో నిర్మించిన పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. తర్వాత కేశప్ప గూడెం, ముకలపల్లి మండలం కొత్తూరులో నిర్మించే హైలెవల్ వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెం ట్ సభ్యులు రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
రికార్డుల పరిశీలన
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి దమ్మపేట ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో పొందుపర్చిన అంశాలను ఇన్‌చార్జి ఎమ్మార్వోను అడిగి తెలుసుకు న్నారు. ఆ రికార్డుల ఆధారంగా బాధితులకు ఫోన్ చేసి, కార్యాలయంలో అందు తున్న సేవలపై ఆరా తీశారు.