హాయ్ పిల్లలు.. ఏంటి అంత పెద్ద బిల్డింగ్ అనుకుంటున్నారా? ఏదైనా మ్యూజియమో.. టూరిస్ట్ ప్లేసో అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే అది లైబ్రరీ కాబట్టి. ఇంతకీ ఇది ఎక్కడుంది. దాని విశేషాలేంటో చూద్దామా..దక్షిణ కొరియాలోని సియోల్ జిల్లాలోని గంగం అనే ప్రాంతంలో ఈ గ్రంథాలయం ఉంది. ఇది కొరియా జాతీయ లైబ్రరీ. దీని పేరు ‘స్టార్‌ఫీల్డ్’. చూడటానికి అద్భుతంగా, అందంగా ఉంది కదా! కొరియాలోనే ఇది అతిపెద్ద గ్రంథాలయం. ఇక్కడ దాదాపు 12 లక్షల పుస్తకాలు ఉన్నాయి. అంతేకాకుండా సుమారుగా 600 రకాల మ్యాగజైన్లు దొరుకుతాయి.
రంగు రంగుల పుస్తకాలు: ఈ లైబ్రరీకి రోజుకు కొన్ని వేలమంది వస్తుంటారు. వీకెండ్‌లో ఇంకా ఎక్కువ జనాలు ఉంటారు. ఇక్కడికి ఎవరైనా వచ్చి పుస్తకాలు చదువుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి ఆరు గంటల వరకు లైబ్రరీ తెరిచి ఉంటుంది. పైకి కిందకి వెళ్లడానికి ఎస్కలేటర్ సౌకర్యం కూడా ఉంది. ఎటు చూసినా.. రంగు రంగుల పుస్తకాలతో ఈ లైబ్రరీ చాలా అందంగా ఉంటుం ది. ఏ పుస్తకం ఏ వరసలో ఉందో వెతుక్కోవడానికి.. ఇబ్బంది పడకుండా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్.. ఈ వర్షెన్‌లో చదువుకోవడానికి ఐపాడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
జంతువుల ఆకారంలో: లైబ్రరీలోకి వెళ్లగానే.. ఒక ఎత్తున బుక్ షెల్ఫ్ ఆకారం కనిపిస్తుంది. దాని ఎత్తు 13 మీటర్ల 42 ఫీట్లు ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. దాని మీద పుస్తకాలతోనే జిరాఫీ, ఎలుగుబంటి.. ఇంకా రకరకాల జంతువుల ఆకారాలు, శాంటా చిత్రం ఏర్పాటు చేశారు.