calender_icon.png 4 October, 2024 | 8:46 AM

ఇదేంటో తెలుసా?

04-10-2024 01:07:09 AM

ఈ చిత్రాన్ని చూడగానే ఏం గుర్తొచ్చింది? నమిలి ఉమ్మేసిన బబుల్‌గమ్‌లాగే ఉందే అనుకొంటున్నారా? కాదు.. ఇది మెదడు. ఫ్రూట్ ఫ్లు అనే ఈగ మెదడు. భూమిపై ఉన్న జీవరాశి శరీరాల్లో అత్యంత క్లిష్టమైన నిర్మాణం మెదడేనని తెలిసిందే. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మెదడును మాత్రం పూర్తిగా శోధించలేకపోయాం.

మొదటిసారి ఫ్లువైర్ కన్సార్టియం అనే అంతర్జాతీయ పరిశోధకుల బృందం మెదడును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సంపూర్ణంగా చిత్రించగలిగింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫ్రూట్‌ఫ్లు ఈగ మెదడులో 1,39,255 నరాలు ఉన్నాయట. వీటి మధ్య ఏకంగా 5 కోట్ల అనుసంధానాలు (కనెక్షన్లు) ఉన్నాయని గుర్తించారు.