విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్.. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఎన్నో రకాల పోషకాలు కావాల్సిందే..! అన్ని పోషకాలూ మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే మన ఆహారం శరీరం సరైన పనితీరుకు అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. మన శరీరానికి అవసరమైన ప్రధాన విటమిన్లలో విటమిన్ డి ఒకటి. శరీరంలో విటమిన్ డి లోపిస్తే అది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగు: విటమిన్ డి లోపాన్ని అధిగమించడంలో పెరుగు కీలక పాత్ర పోషి స్తుంది. ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలను బలపరుస్తుంది. ఇంకా ఆహారం జీర్ణం కావడానికి కూడా ఉపయోగపడుతుంది.
నారింజ: నారింజలో విటమిన్ డి తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని తగ్గించడంలో నారింజ బాగా పని చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో నారింజలను బాగా తినొచ్చు.
గుడ్లు: గుడ్లలో ప్రొటీన్లు, అనేక రకాల విటమిన్లు ఉంటాయి. గుడ్డులోని పసుపు భాగంలో విటమిన్ డి ఉంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు.
పుట్టగొడుగులు: పుట్టగొడుగులలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుం ది. ఇందులో కాల్షియం, ఫాస్పరస్ కూ డా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
పాలు: పాలు తాగడం వల్ల విటమిన్ డి బాగా అందుతుంది. ఆవు పాలలో ప్రొ టీన్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరాన్ని దృఢంగా మార్చుతాయి.
చేపలు: చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వారానికి ఒక్కసరైనా చేపలను ఆహారంలో చేర్చుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.