calender_icon.png 15 January, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవే ఆలోచనల్లో ఉంటున్నారా!

25-10-2024 12:00:00 AM

  • ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత విడిపోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ.. విడిపోతే ఆ బాధ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. అయితే.. కొందరు విడిపోయిన వెంటనే మరో లైఫ్‌లోకి ప్రవేశించి జీవితం గడుపుతారు. మరికొందరు ఆ బాధను మరిచిపోలేక వారి మాజీల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. 

అవే ఆలోచించడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. 

కొంతమంది వ్యక్తులు తమ మాజీ భాగస్వామిని సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. అంతేకాకుండా.. వారి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. సోషల్ మీడియా లో వారు ఏం చేస్తున్నారు.. వారి ఫోటోలు, ఇతర విషయాలను తెలుసుకునేందుకు వెతుకుతూనే ఉంటారు. ఇలా.. రిలేషన్‌షిప్ నుంచి విడిపోయిన తర్వాత కూడా.. వదిలిపెట్టడం లేదంటే వారు రెబెక్కా సిండ్రోమ్‌తో బాధ పడుతున్నారని అర్థం. 

రెబెక్కా సిండ్రోమ్ అంటే ఏమిటి?

లండన్‌లోని సెంటర్ ఫర్ ప్రూడియన్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ డారియన్ ఈ సిండ్రోమ్‌కు పేరు పెట్టారు. గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆలోచనలే గుర్తొస్తాయి. ఆ విషయాలను గుర్తు పట్టడం మీ భాగస్వామికి తెలు స్తుందని అన్నారు. ఈ క్రమంలో మీ భాగస్వామి కోపంతో, అసూయతో ఉంటుంది. ఈ అసూయ రెట్రో యాక్టివ్‌లో పాతుకుపో తుందని అన్నారు.

మీకు రెబెక్కా సిండ్రోమ్ ఉందని అనుకుంటే ఏమి చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో గతానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. గతం మీ ప్రస్తుత సంబంధాన్ని పాడుచేయడమే కాకుండా.. మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది.