calender_icon.png 16 January, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీకూ ఫొటోగ్రఫీ హాబీ ఉందా?

14-09-2024 12:00:00 AM

చాలామందికి ఫొటోగ్రఫీ హాబీగా ఉంటుంది. శీతాకాలంలో వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదంటే మీ కెమెరా ఎక్కువ కాలం మన్నికగా ఉండదు. ప్రస్తుతం గాలిలే తేమ శాతం ఎక్కువగా ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే లెన్స్‌లో ఫంగస్ త్వరగా పేరుకుపోతుంది. 

* కెమెరాను కొనుగోలు చేసినప్పుడు ‘కెమెరా క్లీనింగ్’ కూడా తీసుకోవాలి. కిట్ కొంచెం ఖరీదైనది. కానీ తప్పకుండా ఉపయోగపడుతుంది. కెమెరా లెన్స్ బాడీ, లెన్స్ గ్లాస్‌ను మృదువైన బ్రిస్టల్ బ్రష్‌తో మాత్రమే శుభ్రం చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేయాలి. 

* కెమెరా లోపల పేరుకుపోయిన దుమ్ము, ధూళిని శుభ్రం చేయడం కూడా ముఖ్యం. కానీ దాని కోసం ‘హ్యాండ్ ఎయిర్ బ్లోవర్’ ఉపయోగించాలి. ఇందుకు క్యాన్డ్ ఎయిర్ బ్లోవర్‌ను ఉపయోగించడం మర్చిపోకూడదు. 

* లెన్స్ గ్లాస్‌ను శుభ్రం చేయడానికి ‘మైక్రోఫైబర్’ క్లాత్‌ను ఉపయోగించాలి. లెన్స్ గ్లాస్ మధ్యలో నుంచి బయటికి క్లాత్‌ను తిప్పడం ద్వారా లెన్స్‌ను శుభ్రం చేసుకోవచ్చు.