calender_icon.png 18 January, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?

06-09-2024 12:00:00 AM

మృత్యుమార్గంగా మేడ్చల్  చెక్ పోస్ట్ జాతీయ హైవే

తాత్కాలిక రోడ్డును పూర్తిగా నిర్మించకుండానే ఫ్లుఓవర్ పనులు

భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం

తరచూ రోడ్డు ప్రమాదాలు 

మేడ్చల్, సెప్టెంబర్ 5: మేడ్చల్ చెక్ పోస్ట్ జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారింది. వరుసగా చోటుచేసుకుంటున్న రోడ్డుప్రమాదాలు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ద్విచక్రవాహనంపై ఆ మార్గంలో వెళ్లాలంటేనే వణికపోతున్నా రు. కేవలం ఒక కిలోమీటర్ జాతీయరహదారిపైనే వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుం డడం గమనార్హం. ఫ్లుఓవర్ కాంట్రాక్టర్ నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతోనే ఈ పరి స్థితి దాపురించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లుఓవర్ పనులు ప్రారంభించేముందు ప్రత్యామ్నాయ రోడ్డు వేయా ల్సి ఉండగా, కాంట్రాక్టర్ రోడ్డునున నాసిరకంగా వేసి చేతులు దులుపుకొన్నాడు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ఇక ఆ రోడ్డు కాస్తా అధ్వానంగా మారింది. జాతీయ రహదారి కావడంతో ఈ రోడ్డులో నిత్యం వేలాది మంది వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాలకు గుంతలు ఏర్పడ డంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

ప్రమాదాలు ఇలా..

మేడ్చల్‌కు చెందిన బురుగు రవీందర్ గత నెల 27వ తేదీ రాత్రి తన కుమారుడు సాయి సాత్విక్ (14) తో కలిసి కండ్లకోయ నుంచి బైక్ మీద వస్తున్నారు. బైక్ చెక్ పోస్టు దాటిన తర్వాత వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయిసాత్విక్ ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందాడు. ఇదే మార్గంలో సోమవారం రిలయన్స్ స్టోర్ ముందు అన్నాచెల్లెలు బైక్ మీద వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఘటనలో సోదరుడు దుర్గా ప్రసాద్ తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతిచెందాడు. సోదరి నాగలక్ష్మి కాలు నుజ్జు నుజ్జు అయి ప్రాణాపాయంలో ఉంది. 

ఇష్టారాజ్యంగా పనులు..

ఫ్లుఓవర్ కాంట్రాక్ట్ కంపెనీ ఇష్టారాజ్యంగా పనులు చేపడుతుండడంతో స్థానికుల రాకపోకలు నరకప్రాయంగా మారింది. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో వాగుపై ముందు గా వంతెన వెడల్పు చేసి ఫ్లుఓవర్ పిల్లర్లు నిర్మిస్తే బాగుండేది. కానీ కాంట్రాక్టర్ పిల్లర్లను వాగు వరకు నిర్మించిన తర్వాత వంతెన వెడల్పు చేయించాడు. పిల్లర్ల నిర్మాణం పూర్తయిన చోట బారికేడ్లు అలాగే ఉండడంతో ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తుతున్నా యి. ఇప్పటికైనా ఎన్‌హెచ్‌ఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు స్పందించి ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించాలని, తద్వారా ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

వర్షాలు తగ్గగానే మరమ్మతులు

జాతీయ రహదారిలోని రిలయన్స్ స్టోర్ నుంచి చెక్‌పోస్టు వరకు కిలోమీటర్ రోడ్డు సమస్యల వలయంగా ఉందని మా దృష్టికి వచ్చింది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏ అధికారులకు వివరించాం. పీడీ శ్రీనివాస్ ఇటీవలే ఇక్కడి పరిస్థితులను పరిశీలించారు. వర్షాలు తగ్గగానే తాత్కాలిక రహదారికి మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు.

 హనుమాన్ గౌడ్, 

ట్రాఫిక్ సీఐ, మేడ్చల్