24-02-2025 12:30:24 AM
విరిగిన విద్యుత్ స్తంభం ఎప్పుడూ కూలుతుందో తెలియని పరిస్థితి
ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని అధికారులు
కామారెడ్డి, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి), విద్యుత్ స్తంభం తో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఎన్నోసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం మటన్ మార్కెట్ వద్ద ఉన్న విద్యుత్ స్తంభం ఎప్పుడు విరిగి పడుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రజావాణిలో సైతం ఇప్పటికి మూడుసార్లు ఫిర్యాదు చేసిన విద్యుత్ స్తంభాన్ని మార్చడం లేదు.
ప్రజల ఇబ్బందులను తొలగించాలని విద్యుత్ స్తంభం ఎప్పుడు విరిగి పడుతుందో తెలియని పరిస్థితిలో ఉందని చెప్పిన విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని దోమకొండ గ్రామస్తు లు ఆరోపిస్తున్నారు. వచ్చేది వేసవికాలం కావడంతో వడగాల్పులు వేచిన వడగళ్ల వర్షాలు పడిన విద్యుత్ స్తంభం విరిగిపోయే ప్రమాదం ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదం పొంచి ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర ను విడనాడి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికైనా స్పందిస్తారో లేదో విద్యుత్ శాఖ అధికారులకే తెలియాలి.