09-03-2025 12:42:11 AM
'పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి’ అన్నట్లు సమాజంలో ఎవరి వైఖరి వారిది. అయితే.. కొందరి ఆలోచనలైతే మనల్ని అవాక్కయ్యేలా చేస్తాయి. అలాంటి అవాక్కయ్యే విషయం ఒకటి.. మహిళా దినోత్సవం రోజు సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ‘మహిళలందరి తరఫున నేనొక డిమాండ్ కోరుతున్నా.
ఎలాం టి శిక్షలకు ఆస్కారం లేకుండా మహిళలు మర్డర్ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలి’ అంటూ ఓ ప్రధాన పార్టీకి చెందిన మహిళా విభాగం నాయకురాలు లేఖ రాసింది. లేఖ రాసింది ఒక సాదాసీదా వ్యక్తికి కాదండీ ! దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి.
మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతున్న నేపథ్యంలోనే సదరు పార్టీ నాయకురాలు మర్డర్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని లేఖ రాస్తున్నానని ఆమె పేర్కొనడం గమనార్హం. లేఖ గురించి తెలుసుకున్నవారంతా.. ఎవరైనా ‘మా ఊరికి ఆ సౌకర్యం కావాలి.. ఈ సౌకర్యం కావాలి’ అంటూ లేఖలు రాస్తారే.. కానీ.. ‘ఇలా హత్య చేసేందుకు అవకాశం ఇవ్వాలి’ అంటూ లేఖ రాయడంపై నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
రమేశ్ మోతె