calender_icon.png 6 November, 2024 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయ సంహిత చెప్పిందే చేయండి

05-11-2024 01:00:41 AM

  1. అవసరమైతే నేను హోం మంత్రిగా బాధ్యతలు తీసుకుంటా
  2. క్రిమినల్స్ పట్ల యూపీ సీఎంలా వ్యవహరించాలి
  3. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అమరావతి, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న ఘటనలపట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హోం మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. సోమవారం కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీ హైస్కూల్‌లో సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు ఆయన ఉపకరణాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన పోలీస్ శాఖను ఉద్దేశించి మాట్లాడుతూ.. విమర్శలు చేసే వారిని చూసీచూడనట్టు వదిలేస్తే హోం మంత్రిగా తాను బాధ్యతలు తీసుకుంటానని తేల్చి చెప్పారు. క్రిమినల్స్ పట్ల ఉత్తరప్రదేశ్  సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకం అన్నారు. ఆడ పిల్లలపై అఘాయిత్యాలు చేస్తుంటే కులం పేరు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులకు ఏం చెప్తుందో అది చేయాలని సూచించారు. రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమల రావు ఇందుకోసం బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. దీనిపై హోం మంత్రి అనిత రివ్యూ చేయాలని కోరారు.