calender_icon.png 8 January, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి!

11-09-2024 12:00:00 AM

-అశోక్ యాదవ్ పంచిక :

తెలంగాణ శాసనసభకు 2023 చివరలో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ నెంబర్ సీట్లు 64 స్థానాలతో బయటపడ్డ కాంగ్రెస్, పార్లమెంట్ ఎన్నికల్లో 8 కేవలం స్థానాలకు పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో  42 శాతం రిజర్వేషన్లు, ప్రతి యేటా రూ.20 వేల కోట్లతో సబ్‌ప్లాన్ వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ, తొమ్మిది నెలలు గడుస్తున్నా హామీ అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతున్నది.

ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీసీలకు ఇచ్చిన హామీ 42 శాతం రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ఏ విధమైన ప్రక్రియ మొదలు పెట్టకపోవడంతో బీసీ వాదులు, బీసీ సంఘాల నేతలు, రాజకీ య పార్టీల నాయకులు పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమిస్తున్నా రు. కులగణన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తుండడం తో ఇప్పట్లో కులగణన చేయడానికి ప్రభు త్వం సంసిద్ధంగా లేదని బీసీ సమాజానికి సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలో బీసీ సంఘాల ఒత్తిడి, మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి నిధులు తీసుకురాక పోవడంతో కాంగ్రెసు పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపట్ల అసంతృప్తి కూడగట్టుకొంటున్నది.

ఒక కుటుంబం-- ఒక టికెట్

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గత కొన్నేళ్లుగా పరాజయాలు ఎదుర్కొంటున్నది. అంతేకాక, పార్టీ సీనియర్ నాయకులనుండి అసమ్మతి ఎదురవుతున్న నేపథ్యంలో ఎలాగైనా దేశంలో, రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న లక్ష్యంతో పార్టీ సంస్థాగత సంస్కరణకు నాంది పలికింది. పార్టీ సంస్థాగత, అంతర్గత నిర్మాణ విధానాల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతర్గత విధానంలో భాగంగా 2022 మే 15న ఉదయపూర్ డిక్లరేషన్‌ను ప్రతిపాదించింది. ఉదయపూర్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ అనేక తీర్మానాలను ఆమోదించింది. వాటి లో ఒకటి ‘ఒక కుటుంబం- - ఒక టికెట్’ నియమం. తెలంగాణలో నవంబర్ 30న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కోల్పోయిన ప్రాబల్యాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేసి విజయవంతమైంది. అత్యధిక ఓటు శాతం ఉన్న వెనుకబడిన తరగతుల (బీసీల)ను ఆకర్షించడంలో భా గంగా కాంగ్రెస్ పార్టీ ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ను ఆమోదించి ప్రకటించింది. అయి తే, ఉదయపూర్ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కి హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్తమకుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేశారు.

మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మైనంపల్లి హనుమంతరావు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయన కుమారుడు రోహిత్‌రావు పోటీ చేశారు. చెన్నూరు అసెంబ్లీ నియోజక వర్గంలో గడ్డం వివేక్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయన సోదరుడు గడ్డం వినోద్ పోటీ చేశారు. రెడ్డి, వెలుమ లాంటి వారే కాకుండా ఆర్థిక బలవంతులైన ఎస్సీ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించి బీసీలకు తక్కువ సీట్లు కేటాయించి కాంగ్రెస్ పార్టీ మళ్లీ తన వక్రబుద్ధిని చాటుకుంది.

అంతేకాక, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌లో బీసీలకు రెండు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అధికారికంగా తీర్మానం చేసింది. ఈ లెక్కన తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లకుగాను 34 సీట్లు బీసీలకు కేటాయించాలి. కానీ, గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీసీ నేతలు పెద్దగా గెలుపొందలేదనే నెపంతో, మెజారిటీ టికెట్లు రెడ్లకే దక్కేలా చేసుకున్నారు. బీసీలకు 21 సీట్లు మాత్రమే కేటాయించారు. ఈ విధంగా  కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో రెండోసారి మోసం చేసింది. బీఆర్‌ఎస్ కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రెడ్లకే కట్టబెట్టింది.

కులగణనతోనే అంతిమ లక్ష్యసాధన

మేనిఫెస్టో పరమైన డిక్లరేషన్ గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడంలో భాగంగా పొరుగున ఉన్న కర్ణాటక తరహా హామీలతోపాటు ఓటు శాతం అత్యధికంగా ఉన్న బీసీలను ఎన్నికల ముందు ఆకర్షించేలా స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ , కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ రూపంలో మరొక మోసానికి తెర లేపారు. ఆరు నెలల్లో అమలు చేస్తానన్న కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పది నెలలు గడుస్తున్నా అమలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎప్పటిలాగే బీసీలను పక్కకు నెట్టి మరో నమ్మక ద్రోహానికి సిద్ధమవుతున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ల విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కనీ సం స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటదని బీసీ సమాజం భావించింది. స్థానిక సంస్థల ఎన్నికలలో కులగణన చేయకుండా, 42 శాతం  రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసపూరిత రాజకీ యాలు చోటు చేసుకుంటున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలకు మాత్ర మే పరిమితమయ్యాయి. ఇటు అసెంబ్లీలోగాని అటు లోక్‌సభలోగానీ బీసీలకు రిజ ర్వేషన్లు లేవు. తరతరాలుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక అణచివేత గురైన బడు గు, బలహీన వర్గాలకు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి.

బీసీలకు తగిన రాజకీ య ప్రాతినిధ్యం కల్పించాలని స్థానిక ప్ర జాస్వామ్య, సామాజిక న్యాయ స్ఫూర్తితో దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ రూపొందించిన రిజర్వేషన్ విధానం చారిత్రకమైంది. ఆ స్ఫూర్తితో పొందిన 1992 నాటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలిసారిగా స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు రాష్ట్రాలకు అధికారం లభించింది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన 1994 నాటి పంచాయతీ రాజ్ చ ట్టం ప్రకారం కనీసం 34 శాతానికి తగ్గకుం డా, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు.

కానీ, 1994 నుండి ఇప్పటి వరకు రాష్ట్రాన్ని యూనిట్‌గాకాక జిల్లాను యూనిట్‌గా తీసుకొంటున్నారు. పైగా, 2014 తర్వాత ఏర్పడిన బీఆర్‌ఎస్ ప్రభు త్వం స్థానిక సంస్థలలో అమలు జరుగుతున్న బీసీ రిజర్వేషన్లను 33 శాతం నుండి 18 శాతానికి తగ్గించి, 2018 పంచాయతీ రాజ్ చట్టంలో బీసీ రిజర్వేషన్లను జిల్లా యూనిట్‌గా కేటాయించే విధంగా నిర్ధారించి, అన్ని రాజకీయ పార్టీల మాదిరే వెనకబడిన తరగతులను అణచివేశారు. 

ఒకవైపు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అర్జునుడికి పక్షి మాదిరి ‘నాకు కులగణన ఒక్కటే కనబడుతుందని’ చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2010లో తమిళనాడు బీసీ కోటా విషయంలో మా దిరి బీసీ జనాభా 50 శాతం పరిధి దాటి రిజర్వేషన్ కోటా పెంచదలిస్తే, బీసీ జనా భా అంతే ఎక్కువగా ఉన్నట్టు ఆధారం చూపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం చె ప్పింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అ లాంటి బీసీ జనాభా లెక్కల ఆధారం చూ పింది గనుక 50 శాతం నుంచి 69 శాతం కోటా కొనసాగించడం సమంజసమేనని తీర్పు చెప్పింది.

కాబట్టి, కామారెడ్డి బీసీ డి క్లరేషన్‌లో భాగంగా బీసీ కులగణన జరిపి బీసీ లెక్కలు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు ఆధారం చూపి 42 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతోపాటు స్థానిక సం స్థలలో బీసీ రిజర్వేషన్లు ఏబీసీడీ రూపం లో రిజర్వేషన్లు కల్పించాలి. ఆ డేటానుబట్టి రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని బీసీలకు రిజర్వేషన్లు అమలు జరపాలని, రాజీవ్‌గాంధీ రూపొందించిన స్ఫూర్తిదాయక రిజర్వేషన్ విధి విధానాలను మార్చకుండా సామాజిక న్యాయ నమ్మకాన్ని నిలబెట్టాలని  బీసీలంతా కోరుతున్నారు.

వ్యాసకర్త సెల్: 807476 5350