calender_icon.png 11 March, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలా 15 సార్లు చేయాలి!

09-03-2025 12:00:00 AM

చాలామంది అమ్మాయిలు సన్నగా ఉన్నా, చేతులు మాత్రం చాలా లావుగా ఉంటాయి. దీంతో నచ్చిన దుస్తులు వేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. చేతులు నాజూకుగా తయారవ్వాలంటే మోచేతుల దిగువన, పైన కొవ్వును కరిగించే వ్యాయామాలు చేయాలి. ఈ వ్యాయామాలతో కొవ్వు కరగడంతో పాటు చేతులు, భుజాల కండరాలు కూడా బలపడతాయి. 

డంబెల్ పుష్ అప్స్

రెండు డంబెల్స్ తీసుకుని నేల మీద బోర్లా పడుకుని ప్లాంక్ వేయాలి. చేతులతో పట్టుకున్న డంబెల్స్, కాలి మునివేళ్ల మీద శరీర భారం మోపాలి. తర్వాత ఒక చేతితో డంబెల్ నిటారుగా పైకి లేపాలి. ఇలా లేపేటప్పుడు శరీరం, తల కూడా పైకి తిప్పాలి. ఇలా చెరొక చేత్తో 15 సార్లు మూడు సెట్లు చేయాలి. 

ఆర్మ్ సర్కిల్స్

నిలబడి చేతులు రెండు వైపులా స మాంతరంగా చాపాలి. రెండు చేతుల ను సవ్య, అపసవ్య దిశల్లో వృత్తాకారం లో కదిలించాలి. రెండు చేతులూ ఒకేసారి కదలాలి. రెండు వైపులా 15 సా ర్లు తిప్పి ఆపాలి. తర్వాత రెండు చేతులను కిందకి దింపి స్ట్రెచ్ చేయాలి. 

 అనిత అత్యాల,

అనిత యోగ అకాడమీ

6309800109