16-03-2025 12:11:23 AM
మానసిక గందరగోళం, మానసిక స్పష్టత లేకపోవడం, పనిపై ఏకాగ్రత లేకపోవడం, ఇతర విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడటం వంటి స్థితిని బ్రెయిన్ ఫాగ్ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వీరికి జ్ఞాపకశక్తి క్రమంగా బలహీనపడుతూ ఉంటుంది.
మాట్లాడటంలో స్పష్టత లేకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, ఎప్పుడూ అలసటగా మబ్బుగా అనిపించడం వంటివి ఎక్కువకాలం కొనసాగితే.. వాటినే బ్రెయిన్ ఫాగ్ లక్షణాలుగా భావించాలి.
లక్షణాలు..
* బయటకు వెళ్లేటప్పుడు తరచూ పర్సు, మొబైల్, తాళాలు వంటివి మరచిపోవడం, చిన్న పనులు, నిర్ణయాలకు కూడా ఇతరులపై ఆధారపడటం
* ఏదో మాట్లాడటం మొదలుపెట్టి మధ్యలో దానిగురించి మరచిపోవడం.
జాగ్రత్తలు..
* ఇది దీర్ఘకాలిక సమస్యకాదని.. కొన్ని జాగ్రత్తలతో దీని నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిద్ర, ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
* మెదడు యాక్టివ్‌గా పనిచేయాలంటే విటమిన్ డి కూడా అవసరమే. దీనికోసం ఉదయం, సాయంత్రం పూట 15 నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉండాలి.