calender_icon.png 28 October, 2024 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక రోజు సామాజిక సేవ చేయండి

14-09-2024 12:28:45 AM

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి వినూత్న శిక్ష 

నిజామాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): మద్యం తాగి వాహనం నడిపిన వ్య క్తికి నూతన న్యాయ చట్టాల ప్రకారం ట్రెయినీ ఐఏఎస్, మెజిస్ట్రేట్ రూ.5౦౦  జరిమానాతోపాటు ఒక్కరోజు సామాజిక సేవ చేయాలంటు శిక్ష విధించారు. నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ టీ నారాయణ వివరాల ప్రకారం.. నిజామాబాద్ ఆరో టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో బొమ్మెర్ల సాయినాథ్ ఈ నెల 3న మద్యం తాగి పట్టుబడ్డాడు.  పోలీసులు నిందితుడిని శుక్రవారం నిజామాబాద్ స్పెషల్ జుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అజ్మీరా సాకేత్‌కుమార్ (ట్రెయినీ కలెక్టర్) ముందు హాజరు పరిచారు.

నూతన క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా నిందితుడిలో మార్పు తెచ్చేందుకు ఒక రోజు సామాజిక సేవ చేయాలంటూ తీర్పునిచ్చారు. దీని ప్రకారం మానవత సధన్ (అనాథ పిల్లల ఆశ్రమం) లో సేవచేయాలంటూ సూచించారు. మద్యం తాగి పట్టుబడ్డ మరో ఆరుగురికి  పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా మేజిస్టేట్ రూ.11 వేల జరిమానా విధించారు.