calender_icon.png 19 April, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాగలు అమ్మినోళ్లు.. అప్పుల గురించి మాట్లాడుతారా?

12-04-2025 12:00:00 AM

  1. పేదల భూములు గుంజుకున్నది బీఆర్‌ఎస్ కాదా!
  2. త్వరలో అన్ని మతాలకు, కులాలకు ఒకే చట్టం తెస్తాం
  3. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు

మెదక్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): పదేళ్లుగా అధికారంలో ఉండి, జాగలు అమ్మినవాళ్లు, నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామన్నోళ్లు.. నేడు భూములు ఎలా అ మ్ముతారంటూ బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉన్నదని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. శుక్రవారం ఆయన మెదక్‌లో బీజేపీ ఆత్మీయసభలో పాల్గొని మాట్లాడారు.

పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేటీఆర్, కేసీఆర్ ఒక్క రూపాయి అప్పు తేలేదా అని ప్రశ్నించారు. అప్పులు తెచ్చామని స్వయంగా అప్ప టి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఒప్పుకున్నారని గుర్తు చేశా రు. మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్‌లో వేలాది ఎకరాల పేదల భూములు సేకరించి లాక్కున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌కు అభ్యర్థులు లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, హైదరాబాద్‌లో ఎంఐఎంకు ధీటుగా ఎమ్మె ల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని, మరో మూడేళ్లలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే ఉంటుందన్నారు. మొగోళ్లను బతుక మ్మ ఆడించిన చరిత్ర బీఆర్‌ఎస్‌దని విమర్శించారు.

వక్ఫ్ చట్టాన్ని రద్దు చేశామని, దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు ఒకే చట్టం కింద ఉండాలన్నదే మోదీ తపనని, త్వరలోనే ఆ చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇద్దరు ఎమ్మెల్సీలను గెలిపించినట్లుగానే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, జి ల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మ ల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు.